ఆ రికార్డ్ 'పుష్ప' కు మాత్రమే సాధ్యం..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన పుష్ప ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా ప్రస్తుతం రికార్డులకు కేరాఫ్ గా మారడం జరిగింది. గతేడాది ఈ సినిమా విడుదల అయినప్పటికీ  క్రేజ్ మాత్రం ఇప్పటికీ  ఏమాత్రం తగ్గలేదు. ఇకపోతే సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమాలోని మరీ ముఖ్యంగా  'తగ్గేదేలే'అనే డైలాగ్‌ వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడేస్తున్నారు. సాఅయితే మాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పుష్ప డైలాగ్స్‌ని వాడుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఇండియా, శ్రీలంక మ్యాచ్‌లో..


 జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంతేకాకుండా డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు.అయితే తాజాగా  సెన్సేషనల్ హీరో రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే అనేశాడు.అంతేకాదు రాజకీయ నాయకులు కూడా పుష్ప సినిమా డైలాగులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. ఇకపోతే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ స్పీచ్ ఇస్తున్నారు.


అయితే ఒక సినిమాలోని డైలాగ్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఇంతమంది వాడుకోవడం బహుశా ఒక్క పుష్పకే సొంతం కావొచ్చు. కాగా ఇప్పట్లో ఈ క్రేజు తగ్గేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ నెల చివరి నుండి పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఇప్పటికే సుకుమార్ ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇక పార్ట్2 ను వచ్చే ఏడాది డిసెంబర్ 17 న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: