ఆ అగ్ర హీరో సినిమా చూసి పేరు మార్చుకున్న రవితేజ..?

Anilkumar
మాస్ మహారాజా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రవితేజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన స్వయంకృషితో ఎదిగిన వారిలో చిరంజీవి తర్వాత అంతటి పేరును సంపాదించుకున్నారు వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రవితేజ మాత్రమే అని చెప్పవచ్చు. ఇకపోతే రవితేజ ఇండస్ట్రీ లోకి రావడానికి అనేకమైన కష్టాలు పడ్డాడు.ఇక ఇదిలా ఉండగా డైరెక్టర్ అవుదామని వచ్చి అవకాశాలు లేక అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతమంది డైరెక్టర్ల దగ్గర పని చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు రవితేజ.అయితే రవితేజ ఆ తర్వాత తనలో ఉన్న ప్రతిభను వెలికి తీసాడు.ఆ తర్వాత  కొంత మంది డైరెక్టర్లు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టారు.

అయితే ఈ కలం తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంటా బ్రహ్మాజీ లాంటి హీరోల పక్కన సెకండ్ హీరోగా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. అయితే దీని తర్వాత తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.ఇక  చివరికి హీరోగా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నాడు.అయితే ప్రస్తుతం మాస్ మహారాజా గా రవితేజ గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం స్టార్ హీరోగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం.ఇక ఇదిలా ఉంటె  అసలు విషయంలోకి వెళ్తే రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. అయితే రవితేజ కు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం ఆయనను ఇన్స్పైర్ గా తీసుకొని రవితేజ ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది. ఇకపోతే రవితేజ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించే అవకాశాన్ని కూడా సంపాదించుకున్నాడు.

అయితే రవితేజ తన పేరు మార్చుకోవడానికి గల కారణం కూడా చిరంజీవి నటించిన దొంగ మొగుడు సినిమానే కారణం.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..యండమూరి వీరేంధ్రనాథ్ రచించిన 'నల్లంచు తెల్లచీర' నవల ఆధారంగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి, మాధవి, భానుప్రియ, రాధికలు ప్రధాన పాత్రల్లో నటించిన దొంగమొగుడు సినిమాలో చిరంజీవి ద్విపాత్రిభినయం చేశాడు.అయితే అందులో ఒక పాత్ర నాగరాజు అయితే మరో పాత్ర రవితేజ . ఇకపోతే ఈ సినిమాలోని రవితేజ అనే పాత్ర నచ్చి రవిశంకర్ రాజు తన పేరును రవితేజగా మార్చుకున్నాడు. అంతేకాకుండా రవితేజ గా పేరు మార్చుకున్న తర్వాత తనకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: