బాలకృష్ణ పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన చిత్రం లెజెండ్.. ఇక ఈ సినిమా తరువాత అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు బాలకృష్ణ. ఇక అలాంటి సమయంలోనే బోయపాటి శీను తో అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక దీంతో బాలకృష్ణ అభిమానులు మళ్లీ తన పూర్వ వైభవాన్ని చూశామని తెలియజేశారు. ఇక ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై మంచి విజయ దిశలో కొనసాగింది.
ఇక ఎవరూ ఊహించని విధంగా అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు బాలకృష్ణ ని ఒక మెట్టు పైకి ఎదిగేలా చేసింది. ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో అద్భుతంగా నటించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ పాటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతలు కూడా మంచి లాభాలను అందుకున్నారు.
అయితే ఇండస్ట్రీలో టాప్ గా వినిపిస్తున్నది ఏమిటంటే ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 21వ తేదీన ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.. ఇక అందులో కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా అఖండ చిత్రం విజయోత్సవాన్ని చాలా గ్రాండ్ గా చిత్రబృందం కర్నూలులో ప్లాన్ చేశారు. ఈనెల 12వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విజయాన్ని నిర్వహించబోతున్నారు. ఇక ఈ విజయోత్సవ వేడుకలకు అఖండ కృతజ్ఞత అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో చిత్ర బృందం అంతా పాల్గొనబోతున్నారు.