బిగ్ బాస్ రియాల్టీ షో కు ఇండియా వైడ్ గా ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే, మొదట ఇండియా లో హిందీ లో ప్రారంభమైన ఈ రియాల్టీ షో, ఆ తర్వాత ఇండియా లోని చాలా భాషలలో ప్రసారం అవుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది, ఇది ఇలా ఉంటే తాజాగా తెలుగు లో 24 గా గంటల పాటు ప్రసారం అయ్యే బిగ్ బాస్ 'ఓ టి టి' ని ప్రారంభించారు, తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది . ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' లో ఇప్పటికే మొదటి వారం పూర్తి అయ్యింది, ఇందులో భాగంగా ముమైత్ ఖాన్ మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలిమినేట్ కూడా అయ్యింది.
ఇది ఇలా ఉంటే మొదటి వారం బిగ్ బాస్ 'ఓ టి టి' ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది, ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' నుండి ముమైత్ ఖాన్ వారానికి 80 వేల రూపాయలు తీసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక బిగ్ బాస్ 'ఓ టి టి' షో నుంచి బయటకు వచ్చే ముందు హౌజ్ లో విలువైన వ్యక్తులు , పనికిరాని వాళ్లు అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' హోస్ట్ నాగార్జున అడగ్గా.. అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషు రెడ్డి లకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతు లకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ ఖాన్ తెలిపింది.