విజయ్ కు జోడిగా రష్మిక మందన్న..

Satvika
రష్మిక మందన్న పేరు ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.. చలో మూవీ తో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా తో మంచి పేరును అందుకుంది. తర్వాత  విజయ్ దేవరకొండ తో కలిసి గీతా గోవిందం సినిమాలో నటించింది. సినిమా హిట్ టాక్  ను అందుకోవడంతో వరుస సినిమాలలో నటించె చాన్స్ కొట్టేసింది. మొన్నీమద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలెరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత పుష్ప సినిమాలో నటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. అది కూడా భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యి, అన్ని ఇండస్ట్రీ లో భారీ హిట్ ను అందుకుంది..


దాంతో రష్మిక బాలివుడ్ లో కూడా వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా వుంది. ఇలా అమ్మడు బాగా బిజీ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యేపొయింది.ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ తెరకెక్కిస్తున్న 'బీస్ట్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.. ఆ షూటింగ్ పనుల లో బిజిగా ఉంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా తర్వాత  విజయ్ తెలుగులో నేరుగా సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి 'దళపతి-66' అని వర్కింగ్ టైటిట్ పెట్టారు.


తెలుగు పండగ ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.ఈ మూవీని బై లింగ్విల్‌గా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. దళపతి తెలుగులో చేయబోయే సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి సినిమా కోసం ఓ రాజభవనం సెట్‌ను వేస్తున్నారు. ఆ లోపు పాటను చిత్రీకరించే పనిలో చిత్రయూనిట్ అన్నారు. ఆ సినిమా కూడా హిట్ అయితే రష్మిక మందన్న మరో రికార్డు ను అందుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: