యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
పూజా హెగ్డే హీరోయిన్ గా
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా రాధే
శ్యామ్, ఈ సినిమాను యు
వి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు, ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న కొన్ని కారణాల వల్ల ఈ
సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం
సంక్రాంతి కానుకగా
జనవరి 14 వ తేదీన చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఆ తేదీన విడుదల చేయలేకపోయారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం రాధే
శ్యామ్ సినిమాను
మార్చి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఇలా రాదే
శ్యామ్ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది.
అందులో భాగంగా రాదే
శ్యామ్ చిత్ర బృందం వారు పలు
టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు, ఇందులో భాగంగా రాదే
శ్యామ్ సినిమాలో హీరోగా నటించిన యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ను దర్శకధీరుడు
రాజమౌళి ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా
ప్రభాస్, రాజమౌళి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి, అసలు విషయంలోకి వెళితే... యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్,
రాజమౌళి ని రాధే
శ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావంటూ సరదాగా ప్రశ్నించాడు, అయితే
ప్రభాస్ అడిగిన ప్రశ్నకు
రాజమౌళి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. నువ్వు నా డార్లింగ్, నీ కోసం ఏదైనా చేస్తానంటూ
రాజమౌళి సమాధానమిచ్చాడు, రాధే
శ్యామ్ సినిమాకి
రాజమౌళి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు,
రాజమౌళి ఇలా రాధే
శ్యామ్ సినిమాకు తనవంతు సహాయం చేస్తున్నాడు.