వావ్: రామ్ చరణ్ RC-15 చిత్రానికి కాస్త ఊరట.. ఎందుకంటే..!!
అయితే ఇలాంటి వాటిలో లాభపడి మొదటి చిత్రం ఏమిటంటే రామ్ చరణ్ నటిస్తున్న RC -15 సినిమా అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ కూడా రాజమండ్రిలోనే చిత్రబృందం తెరకెక్కించింది. ఇక ఇందులో కీలకమైన ఒక సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ కూడా అక్కడే కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో షూటింగ్ అయిపోయిన వెంటనే.. పూర్తిగా రాజమండ్రి పరిసరాల లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగినప్పటికీ గానే ఈ సినిమాకి ఇది ఎంతో లాభాలను తెచ్చేలా చేస్తోంది.. అయితే ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో అతని ప్రతి ప్లానింగ్ కూడా ఆయనకు సహాయపడే ఎలా ఉంటుంది.
ఇక ప్రొడక్షన్ డిజైనింగ్‌లో దిల్ రాజుకు ఒక చాలా అనుభవం ఉండడంతో ఇప్పుడు అది ప్లస్ గా మారుతోంది.. బడ్జెట్ పరంగా వాటికి తగ్గట్టు గానే మెయింటైన్ చేస్తూ దిల్ రాజు అన్నివిధాలా సహకరిస్తున్నట్లు గా చెప్పవచ్చు. రామ్ చరణ్ ఇందులో ఒక IAS ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్ గా సర్కారోడు అనే పేరును పరిశీలిస్తున్నట్లు గా సమాచారం. దాదాపుగా ఈ సినిమాలో రెండు వందల కోట్లకు పైగా ఖర్చు తెరకెక్కిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్లు పెంచుకోవాలంటే కచ్చితంగా 20 శాతం షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే చేయవలసి ఉంటుంది.