రాదే శ్యామ్ : ఒక్కటి తక్కువ అయింది?
ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు ప్రసారం అయ్యాయి. ఇక ఇప్పుడు ఇండియాలో బెనిఫిట్ షోలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా కోసం నిరీక్షణ ఎదురుచూస్తున్న అభిమానులు అందరూ కూడా థియేటర్ లకూ ఈ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు రాగా ఈ సినిమా అదిరిపోయింది.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ప్రభాస్ కెరీర్లోనే ఒక మైలురాయి లాంటి సినిమా రాధేశ్యామ్ అంటూ చెబుతున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పూజా హెగ్డే ప్రభాస్ నటన గురించి వీరిద్దరి కెమిస్ట్రీ గురించి మాటల్లేవ్.. ఇక తమన్ ఎప్పటిలాగానే తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేశాడు.
డైరెక్టర్ రాధాకృష్ణ తన టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు.ఇక ఈ సినిమాలోని ట్విస్టులు అయితే ప్రేక్షకులను మునివేళ్ళపై నిలబెడతాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువే రివ్యూలు చెప్పేస్తున్నారు ట్విట్టర్ లో సినిమా చూసిన ప్రేక్షకులు. అయితే కొంత మంది మాత్రం ఒక్కటి తక్కువైంది అంటూ పుష్ప డైలాగ్ చెబుతున్నారు. అది ఏంటో తెలుసా ఫైట్ సన్నివేశం. సాధారణంగా ప్రభాస్ అంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ప్రభాస్ కెరీర్లోనే మొట్టమొదటిసారి ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కింది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అందుకే ఒక ఫైట్ సీన్ ఉంటే మాత్రం బాగుండేది అని కొంతమంది మాస్ అభిమానులు అనుకుంటున్నారట.