రాధేశ్యామ్ : థియేటర్లకు తాళాలు.. ఏం జరిగిందంటే?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా రాధేశ్యామ్ మేనియా కనిపిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  పాన్ ఇండియా మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయింది. దాదాపు 7010 తెరలలో ఇక ఈ సినిమా ప్రదర్శించబడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం థియేటర్లకు బారులు తీరుతున్నారు. ప్రభాస్ కెరీర్లోనే మొట్టమొదటిసారి హిస్టోరికల్ లవ్ స్టోరీగా ఇక ఈ మూవీ తెరకెక్కింది అని చెప్పాలి.



 ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సరిగ్గా రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు అటు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు టిక్కెట్ ధరలను అమాంతం తగ్గించి కొత్త జీవో ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. దీంతో ఎన్నో సినిమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయ్. ఇక ఇటీవలే సినీ పెద్దలు అందరూ కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో ఇక టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే రాదే శ్యామ్ సినిమా విడుదలైంది.


 ఇక దీంతో ప్రభాస్ ప్రభాస్ సినిమా కి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు అనుకున్నారు. కానీ ఊహించని షాక్ తగిలిందిమ్. శ్రీకాకుళం జిల్లా రాజాంలో svc సినిమా థియేటర్కు పోలీసులు రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. రాధేశ్యామ్ మూవీ విడుదల సందర్భంగా థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేసింది. అయితే బెనిఫిట్ షో వేయకుండా దాని అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులు థియేటర్లకు తాళాలు వేయడంతో ఈరోజు సినిమా ప్రదర్శించడం లేదు అంటూ అటు థియేటర్ యాజమాన్యం తెలపడం గమనార్హం. దీంతో అక్కడి వరకూ వెళ్లిన అభిమానులు అందరూ నిరాశతో వెనుదిరిగారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: