లేట్ నైట్ లో ఆ హీరోకు ఆ బ్యూటీతో ఏం పని..!

NAGARJUNA NAKKA
హృతిక్ రోషన్, సబా ఆజాద్ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. లేట్‌ నైట్‌ డిన్నర్‌ పార్టీల్లో ఇద్దరూ కలిసి కనిపించనప్పటి నుంచి బాలీవుడ్‌ జనాలు వీళ్ల రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక రీసెంట్‌గా సబా ఆజాద్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో హోమ్‌ ఫుడ్‌ గురించి ఒక పోస్ట్‌ పెట్టింది. రోషన్‌ ఇంటి నుంచి వచ్చిన హోమ్‌ ఫుడ్‌ అద్భుతమని కామెంట్‌ చేసింది సబా.

సభా ఆజాద్‌ ఇంటి నుంచి దూరంగా ఉన్నా ఇంటి భోజనం తింటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్‌ పెట్టింది. ఇక ఈ పోస్ట్‌లో హృతిక్ రోషన్‌ అక్క కూతురు సురానిక, హృతిక్‌ చిన్నమ్మ కాంచన్ రోషన్, హృతిక్‌ బాబాయ్ కూతురు పష్మినా రోషన్‌ని ట్యాగ్‌ చేసింది. దీంతో హృతిక్‌ రోషన్‌ ఫ్యామిలీకి కూడా సభా ఆజాద్‌ క్లోజ్‌ అయ్యిందనే ప్రచారం మొదలైంది.

హృతిక్‌ రోషన్‌ ఎనిమిదేళ్ల క్రితం భార్య సుశానే ఖాన్‌తో విడిపోయాడు. లాక్‌డౌన్‌లో పిల్లల కోసం ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మళ్లీ కలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇద్దరూ నిర్ణయం మార్చుకోలేదు. అయితే కరోనా ఫస్ట్‌ వేవ్‌ ముగిశాక హృతిక్‌, సభా ఆజాద్‌తో లవ్‌లో పడ్డాడని చెప్తున్నారు. ఇక థర్డ్‌ వేవ్ తగ్గాక సభాని రోషన్‌ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్‌ చేసిందనే ప్రచారం జరుగుతోంది.

హృతిక్ రోషన్‌ ఫ్యామిలీ కూడా సభాని ఓకే చేసింది కాబట్టి, వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గానే హృతిక్‌ ఫ్రెండ్‌ ఫర్హాన్‌ అక్తర్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకల్లో హృతిక్‌ డాన్సులతో హంగామా చేశాడు. అలాగే హృతిక్‌ కూడా రెండో పెళ్లి చేసుకునే ఛాన్స్‌ ఉందని చెప్తున్నారు ముంబాయి జనాలు. హృతిక్‌కి ఇప్పుడు 48 ఏళ్లు, సభాకి 31 ఏళ్లు. మరి 17 ఏళ్ల గ్యాప్‌ ఉన్న ఈ లవ్‌బర్డ్స్‌ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: