పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ఇటీవల నటించిన భీమ్లా
నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక సినిమాలో పవన్
కళ్యాణ్ ను ఢీ కొనే పాత్రలో మరో
హీరో దగ్గుబాటి
రానా పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలకు థియేటర్లో ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం భీమ్లా
నాయక్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పవన్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే త్వరలోనే
పవన్ కల్యాణ్ మరో
రీమేక్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు
ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ
రీమేక్ కన్నా ముందుగానే దర్శకుడు హరీష్
శంకర్ డైరెక్షన్ లో పవన్
కళ్యాణ్ మరో
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన
గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు వీరి కాంబినేషన్
సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరి కాంబినేషన్ లో రాబోతున్న
సినిమా కి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్
నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
అయితే మొదట్లో ఈ వార్త వచ్చినా.. అది కేవలం రూమర్ అని అందరూ కొట్టిపారేశారు. కానీ ఇపుడు ఇదే నిజం చేస్తూ సినిమాలో పవన్
కళ్యాణ్ ఒక పవర్ఫుల్
ప్రొఫెసర్ పాత్రలో మనకు కనిపిస్తారట. అయితే ఇప్పటివరకు పవన్
కళ్యాణ్ ఇలాంటి పాత్రలో నటించలేదు. దీంతో సినిమాలో పవన్
కళ్యాణ్ ప్రొఫెసర్గా ఎలాంటి పాఠాలు చెబుతాడా అని ఆసక్తి ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ కి జోడీగా
పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది..!!