టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంటెడ్
హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చార్మి ఆ తర్వాత
పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..
పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు లైన్
ప్రొడ్యూసర్ గా సహ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు ఆమె.ఒకప్పుడు అందమైన
హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న చార్మి ఇప్పుడు మాత్రం నటనకు పూర్తిగా దూరంగానే ఉంటున్నారట.
మధ్యలో ఒక నటిగా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. అయితే అప్పుడప్పుడూ
ఛార్మి కొన్ని ఫొటోలతో షాక్ అయితే ఇస్తోంది. రీసెంట్ గా విలక్షణ దర్శకుడు
రామ్ గోపాల్ వర్మ ఛార్మి కి సంబంధించిన ఒక ఫోటో పోస్ట్ చేశాడట.సర్కారీ తో డ్రింక్
పార్టీ అంటూ
వర్మ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక
పూరి గ్యాంగ్ తో చాలా క్లోజ్ గా ఉండే
ఛార్మి తరచుగా కూడా పార్టీలలో పాల్గొంటూనే ఉంటుంది.
ఇక రీసెంట్ గా వర్మతో కూడా ఆమె డ్రింక్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం..
వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో అయితే ఛార్మినీ లో యాంగిల్ లో హైలెట్ చేసి చూపించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని చార్మి చాలా డిఫరెంట్గా స్టిల్ అయితే ఇచ్చింది. ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుంది అని మరొకసారి నిరూపించాదట.
తరచుగా ఈ దర్శకుడు
హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే విధంగా ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక ఈ సారి
ఛార్మి కి సంబంధించిన ఫోటో పోస్ట్ చేసి అందరికీ కూడా షాక్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో పై విభిన్నమైన కామెంట్స్ కూడా వెలువడుతున్నాయట..
ఛార్మి మందు తాగుతుందా అని మరికొందరు బాగా ఆశ్చర్యపోతున్నారు.