బాలయ్య కొత్త సినిమాకి బోయపాటి సాయం..?

Anilkumar
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాలపై అందరికీ ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఎప్పటి నుండో భారీ అంచనాలు నెలకొన్నాయి.అంతేకాదు పైగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ కు వెనకాడకుండా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఖర్చుతో తీస్తున్న సినిమా ఇది. అయితే ఇందులో ఊరి పెద్దగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇకపోతే  క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.


ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గోపీచంద్ మలినేనికి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉంది అది ఏంటి అంటే యాక్షన్ సీన్స్ బాగా తెరకెక్కిస్తాడనే గుర్తింపు ఉంది.కాగా క్రాక్ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అంటే అందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఈయన. ఇక అదిరిపోయే 5 యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని.. అంతేకాదు వాటి గురించి బాలయ్య కూడా చాలా కష్టపడుతునట్లు తెలుస్తోంది.ఇకపోతే  60 ఏళ్లు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ..


 బాలయ్య చేస్తున్న మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ సినిమాకు బోయపాటి మాట సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో యాక్షన్ సన్నివేశాల గురించి మాస్ డైరెక్టర్ నుంచి గోపీచంద్ కొన్ని టిప్స్ తీసుకున్నాడని.. అంతేకాకుండా బాలయ్యని ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఫిదా అయిపోతారనే విషయంపై కూడా గోపీచంద్, బోయపాటి డిస్కస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే  తాజాగా బాలయ్య సినిమా లొకేషన్ కు బోయపాటి వచ్చాడు. అయితే కాసేపు అక్కడే ఉండి షూటింగ్ చూసి దర్శక నిర్మాతలతో పాటు బాలయ్యతో ముచ్చటించి వెళ్ళాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: