యంగ్ టైగర్.. మెగాపవర్ స్టార్ కు సేమ్ టు సేమ్..!
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్‌ని ఫోకస్ చేశారు. తెలుగు నుంచి ముంబయి వరకు స్టార్‌డమ్‌ని విస్తరించుకోవడానికి లార్జ్ స్కేల్ మూవీస్ చేస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివతో పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడు. నేషనల్ లెవల్లో రిపేర్ చేయబోతున్నామని అనౌన్స్ చేశాడు.
'కెజిఎఫ్'తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాసీ యాక్షన్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు. కొరటాల సినిమా తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక తారక్ సినిమాలు చేస్తోన్న ఈ ఇద్దరితో రామ్ చరణ్ కూడా సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే డిస్కషన్స్ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. అలాగే కొరటాల, చిరంజీవి కాంబినేషన్లో వస్తోన్న 'ఆచార్య'లో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. వీటితోపాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీకి సైన్ చేశాడు. ఇక ఈ సినిమాల తర్వాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేస్తాడని టాక్ వస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనూ చరణ్ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతోన్న జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ మైలేజ్‌ని కంటిన్యూ చేయడానికి ఒకరు పనిచేసిన దర్శకుడితో మరొకరు సినిమాలు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. మరి ఈ ఫార్ములా వీళ్లకి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.