హిట్టు కొట్టకే మళ్లీ అలాంటి మూవీ చేస్తానంటున్న డైరెక్టర్..!!
ఆ డైరెక్టర్ మరే ఎవరో కాదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం సినిమా ద్వారా మొదటిసారిగా దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మహేష్ - వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మహేష్ తో బ్రహ్మోత్సవం తీసి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. ఇక గత చివరి చిత్రం వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమా ని రీమిక్స్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం వెంకటేష్ కి దక్కింది.
ఇక దీంతో మరొక భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక ఆ నిర్మాత ఎవరో కాదు అఖండ వంటి సినిమాని నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి తనయుడు నే హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు.అందుకు సంబంధించి కథలు కూడా చర్చనీయాంశంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఒక మల్టీస్టారర్ మూవీ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ సినిమాకి టైటిల్ గా అన్నాయ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ట్లుగా తెలుస్తోంది.