బ్రహ్మానందం కల నెరవేరుతుందా !

Seetha Sailaja

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మూడు దశాబ్దాల పాటు టాప్ కమెడియన్ గా శాసించిన బ్రహ్మానందం కు తన కొడుకు రాజా గౌతమ్ ను సక్సస్ ఫుల్ హీరోగా చూడాలని కోరిక. అయితే ఆ కోరిక నెరవేరడం లేదు. ఇప్పటివరకు బ్రహ్మి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తనకొడుకు విషయంలో చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతోంది.


అయితే పట్టువదలని విక్రమార్కుడు లా రాజా గౌతమ్ మరో ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్ గా అతడి సినిమాకు సంబంధించి విడుదలచేసిన లేటెస్ట్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సుబ్బు చెరుకూరి అనే యంగ్ డైరెక్టర్ ఈసినిమాను తీస్తున్నాడు. ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియచేసే కథ చుట్టూ ఈమూవీ ఉంటుంది.  




మోనో ఫోబియాతో బాధపడే యువకుడిగా ఈమూవీలో రాజా గౌతమ్ కనిపించబోతున్నాడు ఒక ప్రమాదం ఈసినిమాలోని హీరో పాత్రను ఎలా మారుస్తుంది ఆ సమస్యను అతడు ఎలా అధిగమించాడు అనే థ్రిల్లింగ్ కథాంశం చుట్టూ ఈకథ తిరుగుతుందట. ఈమధ్య కాలంలో వెరైటీ కథలను సగటు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.


వినూత్నమైన కథతో కొత్త పంథాలో సినిమా ఉంటే చాలు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈమూవీకి ఎమ్ ఎస్ జోన్స్ రూపెర్ట్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. సక్సెస్ బాట పట్టాలని రాజా గౌతమ్ చేస్తున్న ప్రయత్నాలు విజవంతం అయితే బ్రహ్మానందం కు ఒక గిఫ్ట్ ను తెలుగు ప్రేక్షకులు అందించినట్లే. ఇప్పటివరకు టాప్ దర్శకుల వారసులు అదేవిధంగా కమెడియన్స్ వారసులు హీరోలుగా రాణించిన సందర్భాలు లేవు. ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం చాల కష్టమైన పని అయినప్పటికీ రాజా గౌతమ్ చాల సహనంతో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిన పరిస్థితులలో రాజా గౌతమ్ అదృష్టం


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: