వైరల్ వీడియో : త్రిబుల్ ఆర్ క్రేజ్ తగ్గేదేలా.. కెనడాలో ఏం చేశారంటే?
అయితే బాహుబలి సినిమా తర్వాత ఇక ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమా కు ఊహించని రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది అనే విషయం తెలిసిందే. రాజమౌళి ఏ సినిమా తెరకెక్కిస్తున్న ప్రపంచం నలుమూలల ఉన్న ప్రేక్షకులు సైతం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కి కూడా విదేశాల్లో అదే రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. త్రిబుల్ ఆర్ కోసం తాము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం అంటూ కొంతమంది అభిమానులు కాస్త వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే కెనడాలో కూడా అభిమానులు త్రిబుల్ ఆర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయాన్ని కొత్తగా ప్రదర్శించారు.
సినిమా టైటిల్ త్రిబుల్ ఆర్ తో పాటు ఎన్టీఆర్ పేర్లను కార్లతో వచ్చేలా రాసి ఎన్టీఆర్కు అక్కడ ఫాన్స్ అందరు ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఇక కెనడాలో ఫాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్న ఒక వీడియో క్లాస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అంతేకాదు ఇక త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ కి ఈ వీడియో కూడా బాగా ఉపయోగపడి పోతుంది అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ మ్యూజిక్ జత చేసి ముందుగా కొన్ని సార్లు వరుసగా వస్తాయి. ఆ తర్వాత కార్లు అన్నింటినీ ఒక దగ్గర నిలిపి వేసి ఎన్టీఆర్ పేరు వచ్చేలా చేస్తారు. ఇక ఆ తర్వాత సినిమా టైటిల్ త్రిబుల్ ఆర్ పేరు వచ్చేలా కార్లను నిలిపేస్తారు. ఇదంతా చూసి అభిమానులు తగ్గేదేలా అంటున్నారు..