సినిమాలకు గుడ్ బై చెప్పిన మెగా బ్రదర్?
తాజాగా నాగబాబు మరో పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూన్నాయి. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన ఈ పోస్ట్ పై అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ల నా జీవితం లో.. ఎన్నో ఒడిదుడుకుల ను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు, నాకు ఎదురైన కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయ పడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను..అంటూ పోస్ట్ చేశారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా నేను వెనకడుగు వెయ్యలేదు.. నన్ను ఒకరకంగా చెప్పాలంటే ఆ కష్టాలు నన్ను ముందుకు నడిపాయి.దేశ ప్రజల కోసం సహకరిస్తాను. ప్రజల కోసమే ఇక ఈ జీవితం అంకితం అని ఆయన అన్నారు. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. నాగాబాబు సడెన్ గా ఇలాంటి పోస్ట్ పెట్టడం పై అనేక సందెహాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా మారింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.