గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఎక్కువైపోయింది. పెద్ద హీరోలతో నటించి సినిమాలతో మంచి క్రేజ్ ను అందుకున్న సదరు హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కావలసిన మార్కెట్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సమంత మరియు అనుష్క ఒకరు. ఇప్పటికే యూటర్న్ ఓ బేబీ వంటి సినిమాలతో సమంత భారీ విజయాలను అందుకోగా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. తన భుజాలపై ఎంతటి బరువైన కథ నైనా నడిపించగలను అని నిరూపించుకుంది.
ప్రస్తుతం ఆమె రెండు సినిమాలలో మెయిల్ లీడ్ లో నటిస్తుంది. శాకుంతలం అనే సినిమా మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. యశోద అనే మరో థ్రిల్లర్ సినిమా లో కూడా నటిస్తోంది. ఆ విధంగా ఆమె వరుస సినిమాల లో దూసుకుపోతున్నగా తాజాగా ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒక కథను రెడీ చేశాడట. దానిని సెట్స్ పైకి తీసుకురావడానికి మంచి సమయం కోసం ఎదురు చూడగా ఇప్పుడు ఆ సినిమా రాబోతు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దేవదాసి కథ ఇది. ఈ సినిమాకు సాయిమాధవ్ సంభాషణలు సమకూరుస్తున్నారు.
అయితే ఈ కథ ను ముందుగా సమంత కు చెప్పగా ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ చిత్రాన్ని మరో హీరోయిన్ తో చేయాలని ముందుకు వెళ్తున్నారట. ఈ నేపథ్యంలో అనుష్క కూడా ఈ సినిమా చేసే వారి లిస్ట్ లో ఉంది. ఆ విధంగా ఈ ఇద్దరిలో ఎవరు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సినిమా చేయడానికి ముందుకు వస్తారో చూడాలి. అనుష్క అరుంధతి భాగమతి నిశ్శబ్దం వంటి సినిమాల తరువాత మళ్ళీ సినిమాలు చేయని నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా చేస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు ఆమె దాదాపుగా ఫేడవుట్ అయిపోయినది అని అందరూ అనుకుంటున్నారు. మరి వీరిద్దరూ కాకుండా మరొక హీరోయిన్ ఎవరినైనా ఆప్షన్లు పెట్టుకుంటారు అనేది చూడాలి.