టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేసి వెయిటింగులో ఉంచుతున్న సంగతి తెలిసిందే.ఇంకా చాలా మంది డైరెక్టర్స్ అంతా కూడా వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు.ఇక ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం దాదాపు ఏడాదిన్నారా పైగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రాజెక్టుకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకనో ఇంకా ఎస్ అనే మాట చెప్పలేదు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్టు కూడా రెడీ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం... సినిమా పని మొదలైపోతుంది. కానీ ఎందుకు ఈ వెయిటింగ్? అన్నదే ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తోంది.ఇక దీనికి కారణం ఏదైనా కానీ అభిమానుల్లో మాత్రం రకరకాల సందేహాలు అనేవి వ్యక్తమవుతున్నాయి.
అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల ప్రకటనల్ని ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? కొరటాల శివ సినిమా తర్వాత ప్రాజెక్టుల్ని ఖాయం చేసుకోవడం లేదేమిటీ? ముఖ్యంగా బుచ్చిబాబుకు ఓకే చెప్పుందుకు ఎన్టీఆర్ ఎందుకింత సమయం తీసుకుంటున్నారు?ఇక అతడు వినిపించిన స్పోర్ట్స్ డ్రామా కథపై ఎన్టీఆర్ ఇంకా కాన్ఫిడెంట్ గా లేడా? లేదా ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల కోసమే ఎన్టీఆర్ వేచి చూడడం వల్ల ఇలా చేస్తున్నాడా? ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలై ఫలితం వచ్చాక ఎన్టీఆర్ డెసిషన్స్ చెబుతాడా? అంటూ పరి పరి విధాలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆలోచనలు అనేవి సాగుతున్నాయి. అయితే వీటి అన్నిటికీ కూడా చెక్ పెట్టే మంచి మాట ఎన్టీఆర్ తొందర్లోనే చెప్పేస్తాడా? అన్నది చూడాలి.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలి..