సలార్ తో అభిమానులకు ఫుల్ బిర్యానీ ఖాయమట..!!

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాల షెడ్యూళ్లను ప్రభాస్ మ్యానేజ్ చేస్తున్నాడు.ఓవైపు ఆదిపురుష్ 3డి సినిమా మరోవైపు సలార్ సినిమాలతో బిజీ అయిన ప్రభాస్ ఇంతలోనే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఆదిపురుష్ 3డి షూటింగ్ పూర్తి కాగా.. నిర్మాణానంతర పనులు అనేవి సాగుతున్నాయి. సలార్ షూటింగ్ మెజారిటీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇక నాగ్ అశ్విన్ తో షూటింగ్ జరుగుతోంది.ఇదిలా ఉండగా ఈ మూడు సినిమాల్లో ఏ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు? అంటే.. దేనికదే డిఫరెంట్ అని చెప్పాలి. కానీ కేజీఎఫ్ దర్శకుడి నుంచి వస్తున్న సలార్ సినిమాపై మాత్రం ఎంతో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమా సంచలనాలు మరో లెవల్లో ఉంటాయని భావిస్తున్నారు.



సలార్ సినిమా ప్రత్యేకత ప్రభాస్ అభిమానులకు ఇంకా మాస్ ఆడియెన్ కి ఫుల్ బిర్యాని ట్రీటిస్తుందని అంచనా. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వేచి చూస్తున్న జానర్ ఇదే. ఆగస్టులో రానున్న ఈ సినిమా ఆదిపురుష్ 3డి కంటే విభిన్నమైనది.ఇకపోతే ప్రభాస్ ఎంపికలు దేనికదే యూనిక్ అనడంలో ఎలాంటి సందేహం అనేదే లేదు. సలార్ సినిమా మాస్ యాక్షన్ కంటెంట్ తో మాఫియా నేపథ్యంలో సాగనుండగా ఇంకా ఆదిపురుష్ 3డి పురాణ పురుషుడు శ్రీరాముడి కథతో రూపొందడం మంచి ఉత్కంఠ పెంచేదిగా ఉంది. ఇక వీటన్నిటికీ భిన్నంగా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా కంటెంట్ తో రూపొందుతున్నవి. రెబల్ స్టార్ ప్రభాస్ ని మరో లెవల్లో నిలబెడతాయని అంచనా.ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: