ముందు బుచ్చిబాబు.. ఆ తర్వాత కొరటాల.. ఎన్టీఆర్ అర్థం అదేనా..!!

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి ఏమాత్రం అప్డేత్ ఇవ్వక పోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. చివరగా 2018వ సంవత్సరంలో అరవింద సమేత చిత్రంతో పలకరించిన ఆయన ఈ మూడున్నరేళ్లుగా ప్రేక్షకులను పలకరించలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఎన్టీఆర్ పూర్తి ధ్యాస పెట్టాడు. అయితే 2020 లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం గా వాయిదా పడుతూ రాగా చివరకు ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాజమౌళి సినిమా అంటే ఆలస్యం అవడం అనివార్యం.

 కానీ ఈసారి కరోనా ఈ సినిమాను ఇబ్బంది పెట్టింది అయితే ఈ సినిమా వాయిదా పడడం అనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్ చరణ్ ప్లాన్ చేసుకున్న విధంగా ఎన్టీఆర్ తన సినిమాలను ప్లాన్ చేసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆర్ఆర్ఆర్ లో తన పని అయిన తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శంకర్ చిత్రాన్ని మొదలు పెట్టేసాడు చరణ్. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల కావడానికి తయారవుతుంది. కానీ ఎన్టీఆర్ పరిస్థితి అలా లేదు. దీని తర్వాత ఆయన కొరటాల శివ చిత్రం ఓకే చేసినా కూడా అది ఇప్పటి వరకు మొదలు కాలేదు .

బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి కానీ అది కూడా ఇప్పటివరకు మొదలు కాకపోవడం అందరినీ టెన్షన్ పెట్టిస్తుంది. అయితే తాజాగా కొరటాల శివ సినిమా సంగతులు చెప్పకుండా బుచ్చిబాబు సినిమా గురించి ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పడం చూస్తుంటే కొరటాల కంటే ముందే బుచ్చిబాబు సినిమా ఉంటుందా అని ఆలోచన తెప్పిస్తుంది. ఈ సినిమా ప్రకటన ఇస్తే వెంటనే మొదలు పెట్టాలి కనుక ఏప్రిల్లో ఈ చిత్రం యొక్క ప్రకటన ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టే విధంగా ముందుకు పోతున్నాడు. ఈ నేపథ్యంలో  కొరటాల శివ సినిమా ఏమవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: