చిట్టిబాబు, పుష్ప రాజ్ లాంటి రోల్స్ రావాలి!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో ఒక హీరో సక్సెస్ కావాలి అంటే చిత్రాలు సూపర్ హిట్ అవడమే కాదు ఆ సినిమాలో చేసే పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోవాలి అప్పుడే సదరు హీరో స్టార్ హీరోగా ఎదుగుతాడు.  ప్రేక్షకులను ఎప్పుడు గుర్తుంచుకునేలా చేస్తాడు. ఆ విధంగా రామ్ చరణ్ ఆమధ్య రంగస్థలం సినిమాలో చేసిన చిట్టి బాబు పాత్ర ద్వారా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు. ఆ పాత్ర ఇప్పటికీ ఎవరూ మరిచిపోక పోవడమే రామ్ చరణ్ కు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం అని చెప్పాలి.

 ఆ చిత్రంలో ఆయన నటించిన తీరు అమోఘం. ఎక్కడ కూడా ఈ పాత్రలో రామ్ చరణ్ కనిపించలేదు కాబట్టే ఆ చిత్రం ఆయనకు గొప్ప పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకులలో అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన పాత్ర పుష్పరాజ్ ఈ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా ఎక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా పుష్ప పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పించింది కనుకే ఇంతటి పెద్ద విజయాన్ని ఆ చిత్రానికి అందజేశారు ప్రేక్షకులు.

అలాగే అర్జున్ రెడ్డి పాత్ర తో ప్రేక్షకులను ఎంతో మరింత ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికీ ఈ సినిమా ఎంతో ఇంపాక్ట్ కలిగి ఉంది ప్రేక్షకులలో. ఆ విధంగా ఈ హీరోల పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే తప్పకుండా సదరు చిత్రాలు సూపర్ హిట్ అవుతాయి. హీరో కెరియర్ బాగా బిల్డ్ అయ్యే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ కూడా ఈ విధమైన ఇమేజ్ తెచ్చుకునేందుకు రోల్స్ డిజైన్ చేయించు కుంటున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయే పాత్ర ప్లే చేయించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పాత్రల ద్వారా హీరోలు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: