టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఆచార్య సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల ఈ సినిమా ఫైనల్ కట్ ను రెడీ చేసిన కొరటాల శివ రన్ టైం విషయంలో వెనక్కి తగ్గలేదట. సాధారణంగా ఈ రోజుల్లో సినిమా రెండున్నర గంటలు ఉంటేనే ఆడియన్స్ ఓపికతో థియేటర్స్ లో కూర్చోడం కష్టమైపోతోంది. అలాంటిది ఆచార్య సినిమా ఏకంగా మూడు గంటలు ఉందని సమాచారం. దీంతో ఆచార్య ఫైనల్ కట్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఒక్క సారిగా షాక్ కు గురయ్యారట. వెంటనే ఒక 15 నిమిషాల నిడివిని తగ్గించమని కొరటాల శివను కోరారట చిరంజీవి. సినిమా ఎంత బాగున్నా మూడు గంటల సమయం అంటే ఆడియన్స్ లో ఎక్కడోచోట ఇబ్బంది ఉంటుందని..
అందుకే మూడు గంటలకు రాకుండా రన్ టైం తగ్గించమని మెగాస్టార్ చిరంజీవి సూచించారట. చిరంజీవి సూచించినట్లుగానే కొరటాల శివ అదే తరహాలో రన్ టైమ్ ని తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాని రెండు గంటల 45 నిమిషాలకు ఫిక్స్ చేసే ఆలోచనలో కొరటాల శివ ఉన్నారట. ఇక మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ అలాగే రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఏప్రిల్ 29 న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి...!!