దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయిన ప్రముఖ నటి..!!

Divya
సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటి చేసినటువంటి పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇక మంచి ఇమేజ్ ఉన్న ఈ నటి పర్సులు కొట్టేసి చిల్లర పనుల్ని చేస్తోందన్న విషయం పై తాజాగా నిరూపించడం జరిగిందట. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం జరిగినట్లు తెలుస్తోంది.. ఒక సెలబ్రిటీ హోదా లో ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడంతో ప్రేక్షకులు మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె బ్యాగ్ లో దొరికిన ఒక డైరీలో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లుగా చెబుతున్నారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బెంగాల్ చిత్ర పరిశ్రమలో నటిగా పేరుపొందిన రూపా దత్త పరిశీలి దొంగతనం చేస్తూ ఉండగా అడ్డంగా దొరికిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె బెంగాల్ టీవీ సీరియల్ లో పలు నాటికలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోల్ కత్తా లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో అక్కడ దొంగతనం చేస్తూ దొరికిపోయింది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ పై కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది.. తనని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఒక పోస్టును కూడా తెలియజేసింది సోషల్ మీడియాలో అలాంటి ఆరోపణలు చేసిన ఈమె ప్రస్తుతం పోలీసులకు పర్సులు దొంగతనాలు చేస్తూ దొరికిపోవడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.


అయితే ఆమె పట్టుపడిన విధానం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉందని చెప్పవచ్చు. ఇక అక్కడ ఉండే కొన్ని రకాల పర్స్ లను  ఆమె చెత్తబుట్టలో పడేస్తున్న అటువంటి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె బ్యాగ్ ను తనిఖీ చేయడం జరిగిందట. దీంతో ఆమె బ్యాగ్ లో ఎన్నో పర్స్ లతో పాటు గా  రూ.50 వేల రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆమె డైరీ లో ఎన్నో విషయాలను రాసుకున్న వాటిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: