అలా నటించడానికి అస్సలు అభ్యంతరం లేదంటున్న సన్నీ లియోన్..!
ప్రేక్షకులు నా నుంచి కోరుకునేది అదే
నా వద్దకు వచ్చే వారందరూ కూడా హాట్ రోల్స్, ఐటెం సాంగ్స్ కోసమే వస్తారు. తెరపై అందాల ప్రదర్శన చేయాలని ఎక్కువ అడుగుతుంటారు. వారలా అడగటం నాకేం ఇబ్బంది కాదు ప్రేక్షకుల అభిరుచి మేరకే దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తారు. ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూస్తున్నారని నా సినిమాలు సెక్సీగా, సెన్సువల్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారని కాబట్టి నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. నేను అవే చెయాల్సి వస్తోంది అని సన్నీ పేర్కొందట..
ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూడడం నాకేం అస్సలు ఇబ్బంది కాదు. నేను వారిని బాగా గౌరవిస్తాను. నా మొదటి సినిమా నుంచి ఎంతో మంది నన్ను అభిమానిస్తున్నారు. నన్ను నన్నుగా ఆమోదించారని ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలని నాకు ఉంటుంది. కానీ, ఆ అవకాశం ఎప్పుడో దొరుకుతుందో మన ఇష్టాయిష్టాల కోసం నిర్మాతల డబ్బులను రిస్క్‌లో పెట్టకూడదు కదా.. తెరపై అందాల ప్రదర్శన చేయడానికి నాకేం అస్సలు అభ్యంతరం లేదు. పాత్రను బట్టి ఎలా నటించాలో నాకు ఓ క్లారిటీ ఉంటుందని సన్నీ చెప్పుకొచ్చిందట.
వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న సన్నీ లియోన్ సరోగసీ విధానం ద్వారా తల్లి అయిందని అద్దె గర్భం ద్వారా సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ తల్లిదండ్రులయ్యారని సమాచారం. వీరికి అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అని పేర్లు కూడా పెట్టారు. అంతకు ముందు ఒక పాపను సన్నీ దత్తత కూడా తీసుకుంది. ఆ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అని నామకరణం l
కూడా చేసింది. వీరికి సంబంధించిన ఫొటోలను సన్నీ లియోన్ ఎప్పటికప్పుడు కూడా అభిమానులతో పంచుకుంటుంటుంది.
మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో సన్నీ లియోన్ తెలుగు తెరంగేట్రం చేసిందట ఆ సినిమాలో ఐటెం సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని సన్నివేశాల్లో కూడా ఆమె నటించింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్‌లు చేసి కూడా మెప్పించింది. ఇక, త్వరలో మంచు విష్ణు హీరోగా నటించనున్న గాలి నాగేశ్వరరావు సినిమాలో ఓ హీరోయిన్ పాత్రను సన్నీ దక్కించుకుందట ఈమె. ఆ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కథానాయిక పాత్రలో సన్నీ మెరవనుందని ఇషాన్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు.