టాలీవుడ్ యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన 'రాధేశ్యామ్'
సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడీగా
పూజా హెగ్డే నటించింది.
మార్చి 11న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ
సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమాకి
ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా క్లాస్ ఆడియెన్స్ ను ఈ
సినిమా ఆకట్టుకుంటోంది. పిరియాడిక్
లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ
సినిమా మాస్
ఆడియన్స్ నని ఆకట్టుకోవడంలో విఫలం అయిందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించాడు అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి. ఈ మేరకు ఈ
సినిమా చూసి ట్విట్టర్లో తన స్పందన కనబరుస్తూ.. 'రాదే
శ్యామ్ లాంటి
సినిమా చాలా అరుదుగా వస్తుంది. సోదరుడు
రాధాకృష్ణ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.
ప్రభాస్ ని
విక్రమాదిత్య లాగా చూడడం విజువల్ ట్రీట్ లా అనిపించింది.
పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో అద్భుతంగా జీవించింది. ఈ ఏ పిక్
లవ్ స్టోరీని
సిల్వర్ స్క్రీన్ పై వీక్షించి అద్భుతమైన అనుభూతిని పొందండి' అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు హను రాఘవపూడి దీంతో. రాధేశ్యామ్ సినిమాపై ఆయన చేసిన ఇట్లు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు, జగపతి బాబు,
మురళి శర్మ,
భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా..
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ
సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ
సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకుంటోంది. ఇప్పటికే ఈ
సినిమా 119 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్నట్లు సమాచారం. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం అనే చెప్పాలి...!!