ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్ అయ్యావు రాధేశ్యామ్!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరో గా నటించిన  విజువల్ వండర్ రాధే శ్యామ్ సినిమా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితం కాగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం గత వారం విడుదల అయ్యింది. ఈ సినిమా ను యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా చూడొద్దని మొదటి నుంచి చిత్రబృందం చెప్పే మాట. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా నిడివి చాలా పెద్దగా ఉండేది. అయితే ఫైనల్ కు వచ్చే సరికి చాలా వరకు కట్ చేసేశారట యూనిట్. అదే సమయానికి ఇది పెద్ద డ్రా బ్యాక్ అని కొంతమంది చెప్పుకుంటున్నారు.

ఇంత భారీ నేపథ్యం కలిగిన సినిమాకు తక్కువ నిడివి ఉండడమే ఈ సినిమాతో మ్యాజిక్ చేయలేకపోయారని ఆ మ్యాజిక్ ఎక్కడో మిస్ అయిందని చెబుతున్నారు. ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను కొంత మాత్రమే చూపిస్తే బాగుండేది. డెస్టినీ తో హీరో పోరాడే సన్నివేశాలు ఇంకా కొన్ని పెట్టి ఉంటే బాగుండేదని చెప్తున్నారు. వీటికి సంంధించిన విషయాలను వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ చిత్రం కు నెగిటివ్ టాక్ కి కారణం మంచి సన్నివేశాలను ఎడిట్ చేసి కీలక సన్నివేశాలను తొలగించడం తోనే అనినంటున్నారు.

ఆ సన్నివేశాలు తొలగించడమే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేదని అంటున్నారు. ఇదే ఇప్పుడు ఈ సినిమాకు ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ మరియు పూజాహెగ్దే ల మధ్య వచ్చే కీలక ఎపిసోడ్ లను ట్రిమ్మింగ్ పేరుతో చివరి నిమిషంలో లేపేయడం డ్రా బ్యాక్. సినిమాను నిర్దేశించే సన్నివేశాలను కూడా ఎక్కువ భాగం కట్ చేయడం వంటివి ఈ చిత్రం హిట్ కాకపోవడానికి ప్రధాన సమస్యగా మారిందని చెబుతున్నారు. ఆ విధంగా సినిమాకి వీరు కట్ చేసిన సీన్స్ బలంగా మారకపోగా బలహీనంగా మారిందని చెప్పవచ్చు. ముందు అనుకున్న వెర్షన్ ను విడుదల చేస్తే ఇంకా బాగుండేదని కొంతమంది చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: