ప్రపంచానికి నిజం చెప్పాలనే ఆ సినిమా తీశా : వివేక్
ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో కూడా నిజం అయింది. అందుకే దర్శక నిర్మాతలు అందరూ కూడా సరికొత్త కథలనే తెరమీదకు తీసుకు వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులకు సరికొత్త విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరి కొంత మంది ప్రముఖుల జీవిత కథలనే సినిమాలుగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి విషయాలను కూడా అందుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారత్ గురించి ఎన్నో నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచానికి నిజాలు చూపించాలని ఉద్దేశంతోనే కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీశాను అంటూ చెప్పుకొచ్చాడు. దేశానికి కీర్తిస్తూ దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సినిమాలు చేయడానికి హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందాను అంటూ చెబుతున్నాడు. ఇక ఈ సినిమా కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీర్ హిందువుల వలస ఆధారంగా రూపొందింది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి..