మళ్ళీ వాయిదా పడిన హరిహర వీరమల్లు షెడ్యూల్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా భీమ్లా నాయక్ సినిమాతో పాటుగా హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టాడు,  కాకపోతే భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడంతో హరిహర వీరమల్లు షూటింగ్ వాయిదా పడింది,  అలాగే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ అంగీకారంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొండపొలం సినిమాను తెరకెక్కించడం  కారణంగా హరిహర వీరమల్లు మూవీ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే కొండపొలం సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతుంది,  ఆయన ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు,  ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమా 50% కంప్లీట్ అయినట్లు క్రిష్ జాగర్లమూడి ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.


 అలాగే కొండపొలం సినిమా విడుదలయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లు కూడా ఆయన తెలియజేశాడు,  కాకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మార్చి 18 వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి,  అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మార్చి 18 వ తేదీన కూడా ప్రారంభం కావడం లేదని తెలుస్తోంది.  ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారంలో మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా  హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ మూవీ కోసం చిత్ర బృందం భారీ సెట్ లను కూడా నిర్మించింది,  ఈ సినిమాను ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: