నాగార్జున హీరోగా
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. ఈ చిత్రాన్ని నారాయణ దాస్,
రామ్ మోహన్ రావు,
శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక చివరిగా బంగార్రాజు అంటే ఒక గ్రామం నేపథ్యంతో కూడిన సినిమాలో నటించిన
నాగార్జున ఆ తర్వాత చేయబోతున్న చిత్రం ఇదే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని బాగా ఆసక్తిని పెంచుతాయి. తాజాగా ఈ
సినిమా లోకేషన్ నుంచి కొన్ని ఫోటోలు బయటికి రావడం జరిగింది.
ఇక
నాగార్జున ప్రస్తుతం దుబాయిలోని ఎర్రటి ఎండలో.. ఎడారిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక
నాగార్జున యాక్షన్ సీన్ సన్నివేశాలు పాల్గొంటున్నట్లు గా ఆ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇసుకలో దూసుకొని వెళ్లే
బైక్ తో
నాగార్జున విలన్ గ్యాంగ్ ను చేజ్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా..
నాగార్జున ఆ సమయంలో కూడా రిస్కు చేస్తున్నాడు అంటే అది విశేషమని చెప్పవచ్చు. ఇక పైన ఎండ కింద ఇసుక వేడి ఎటు చూసినా కూడా ఎక్కువ వేడి ఉన్నప్పటికీ కూడా..
నాగార్జున వెనుకడుగు వేయకుండా రెండు మూడు సార్లు షూటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఎన్నో జాగ్రత్తలు పాటించినప్పటికీ.. ఇలాంటి సన్నివేశాలు నటించాలంటే చాలా కష్టమని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇక
డైరెక్టర్ ఇదివరకు కూడా గరుడవేగ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా అలాంటి చేజింగ్ లతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో
హీరోయిన్ గా
సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవలే చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పగానే ఎవరు ఏమి యాక్టింగ్ గురించి మాట్లాడరు ఆమె గ్లామర్ టచ్ ఉన్న పాత్ర గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇదివరకే
నాగార్జున నటించిన ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.