అనసూయ రేంజ్ మారిపోయిందిగా...!!

murali krishna

టైటిల్ చూసి మెగాస్టార్ చిరంజీవిని యాంకర్ మోసం చేయడమేమిటి అబ్బా అని అనుకుంటున్నారా.ఇంతకీ ఏ విషయంలో చిరంజీవి మోసపోయాడని.. మోసం చేసిన ఆ యాంకర్ ఎవరని మీరు అందరూ ఆలోచిస్తున్నారా..


అయితే కాస్త ఆగండి.. ఇదంతా రియల్ లైఫ్‌లో జరిగింది కాదట కేవలం రీల్ లైఫ్‌లో మాత్రమే జరిగిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్‌ఫాధర్' ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోందని తెలుస్తుంది.


అయితే ఈ సినిమాలో చిరంజీవిని ఓ టాప్ యాంకర్ మోసం చేస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుని మోసం చేసే పాత్రలో టాప్ యాంకర్ అనసూయ నటిస్తోందట. ఇక ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరంజీవి సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తాడని తెలుస్తుంది.అయితే అనసూయకు చిరంజీవి ఓ విషయంలో సాయం చేస్తాడని.. కానీ అది చివరకు ఆయనకే చెడు చేస్తుందని సమాచారం.


అనసూయ బిడ్డకు చిరంజీవి తండ్రి అని ఆమె కోర్టులో చెప్పడంతో, ఆయన స్నేహితులు చిరుని జైలుకు పంపిస్తారు.. అయితే ఇదంతా ఎందుకు జరిగిందనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. యాంకర్‌గా తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ, ఇటు వెండితెరపై తన నటనతో కూడా మెప్పిస్తోంది.


గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం, అది కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనసూయ బాగా హ్యాపీగా ఉందట. మరి నిజంగానే గాడ్‌ఫాదర్ చిత్రంలో అనసూయ చిరుని మోసం చేసే పాత్రలో కనిపిస్తుందా అనేది లేదో చూడాలి మరి . ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: