బెంబేలెత్తిపోతున్న పవన్ నిర్మాతలు!!

P.Nishanth Kumar
భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక నేపథ్యంలో తొలిసారిగా నటిస్తున్న సినిమా హరిహర వీర మల్లు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గబ్బర్ సింగ్ కాంబినేషన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు.

స్టైలిష్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది అని చెబుతున్నారు. ఇక ఈ మూడు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ మరొక సినిమా కూడా చేయనున్నాడని తెలుస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదీయ సితమ్ అనే ఈ చిత్రాన్ని తెలుగులో చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ మరొకసారి ఈ సినిమా కోసం రచనా బాధ్యతలు మోయనున్నాడు. 

సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే పవన్ తో సినిమా చేసే నిర్మాతలు పవన్ సినిమాల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ పెట్టే ఇబ్బందులను చూసి కొంత భయపడుతున్నారట. విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం పెట్టే కొన్ని ఆంక్షలు వారు తట్టుకోలేకపోతున్నారు. ఇలా అయితే పవన్ తో సినిమా చేయడం కష్టం అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ దీనిని ఏవిధంగా సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే అయన అక్కడి ప్రభుత్వం పై కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది ఎంతటి ప్రకంపనాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈనేపథ్యంలో భవిష్యత్ లో ఇలాంటి వి ఎదురైతే ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: