మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రవితేజ కొంత కాలం క్రితం వరకు పరాజయాలతో డీలా పడిపోయి ఉన్న సమయంలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. క్రాక్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ తాజాగా ఖిలాడి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఎన్నో అంచనాల నడుమ ఖిలాడి మూవీ తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది. క్రాక్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో ఖిలాడి సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు, అలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
ఇలా క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రవితేజ 'ఖిలాడి' మూవీ తో ఆయన అభిమానులను నిరుత్సాహ పరిచాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, రీసెంట్ గా ఈ మూవీ టీమ్ స్పెయిన్ కు వెళ్ళింది, స్పెయిన్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు, ఈ సందర్భంగా దిగిన ఒక ఫోటో ను చిత్ర బృందం బయటకు వదిలింది. ఈ మూవీ ని అభిషేక్ అగర్వాల్ , విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు, ఈ మూవీ లో రవితేజ సరసన పెళ్లి సందD బ్యూటి శ్రీ లీల ఇలా హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజ ఈ సినిమా తో పాటు ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు.