తన శవాన్ని పెళ్లికూతురులా ముస్తాబు చేయాలని.. కోరిన హీరోయిన్ ఎవరో తెలుసా?

praveen
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే వారికి సంబంధించిన వార్త ఏదైనా సామాజిక మాధ్యమాల్లో కి వచ్చింది అంటే అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక సినిమా హీరోలు హీరోయిన్లకు సంబంధించిన వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్హీరోయిన్ గా ఎదిగింది స్మితాపాటిల్. తన అందం అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.


పలు సినిమాల్లో నటించి జాతీయ అవార్డులు సైతం తన నటనతో దక్కించుకుంది స్మితాపాటిల్. అక్టోబర్ 17, 1956 లో జన్మించిన స్మితాపాటిల్ మొదట ఒక న్యూస్ చానల్ లో పని చేసింది. అయితే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్  స్టూడెంట్ తన డాక్యుమెంటరీ కోసం తీసిన సినిమా ద్వారా ఇండస్ట్రీలో  అవకాశం దక్కించుకుంది స్మితాపాటిల్. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజ్ బబ్బర్  ను వివాహం చేసుకున్నారు. ఇక తమ అభిమాన హీరోయిన్ స్మితాపాటిల్ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉందని అనుకున్నారు  అభిమానులు. కానీ అంతలోనే ఊహించని ఘటన.


 ఏకంగా 30 ఏళ్లకే కన్నుమూసింది ఈ హీరోయిన్. ఏకంగా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఊహించని రీతిలో బ్రెయిన్ డెడ్ అయి స్మితాపాటిల్ చనిపోయింది. అయితే ఆమె చనిపోయేముందు మాత్రం కుటుంబ సభ్యులను ఒక  కోరిక కోరిందట. మృతదేహాన్ని పెళ్లికూతురులా ముస్తాబు చేసి అంత్యక్రియలు నిర్వహించాలని కోరిందట.  ఈ క్రమంలోనే మేకప్ ఆర్టిస్టులు పిలిపించి మరీ మేకప్ వేసి పెళ్లికూతురులా ముస్తాబు చేసి అంత్యక్రియలు నిర్వహించారట కుటుంబ సభ్యులు. ఇక ఈ విషయం స్మితాపాటిల్ అభిమానులకు చాలా తక్కువ మందికి తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: