అలనాటి తార మాలాశ్రీ.. జీవితంలో ఇన్ని విషాదాలా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత మాత్రం వివిధ కారణాలతో కనుమరుగైపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఇక అలాంటి హీరోయిన్లను తెరమీదకు తీసుకు రావడమే పనిగా పెట్టుకున్నారు కమెడియన్ అలీ. ఒకవైపు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా అవతారమెత్తి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతి వారం ఒక స్పెషల్ గెస్ట్ ను తన కార్యక్రమానికి పిలవడం వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం.. ఇక వారి కెరియర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేలా చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు కమెడియన్ అలీ.



 ఇకపోతే కమెడియన్ అలీ ఇటీవలే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మాలాశ్రీ ని గెస్ట్ గా పిలిచారు. ఇక ఎన్నో రోజుల నుంచి అటు సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోయిన మాలాశ్రీ ఒక్కసారిగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో కనిపించడంతో అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందంలో మునిగిపోయారు అనే చెప్పాలి. ఇక ఈ సందర్భంగా మాలాశ్రీ తన కెరియర్ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒకేసారి 19 సినిమాలు చేశాను అని చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు మాలశ్రీ.


 తెలుగు ఇండస్ట్రీలో ఒకేసారి 19 సినిమాలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే అటు కన్నడలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న మాలాశ్రీ ఇక అక్కడ ఒకేసారి 19 సినిమాలలో నటించారూ. కాగా కెరీర్ గురించి మాత్రమే కాదు నిజజీవితంలో జరిగిన విషాదకర ఘటన గురించి కూడా చెప్పుకొచ్చారు. తన మొదటి సినిమా హిట్టయిన ఆనందంలో ఉన్న సమయంలో తన తల్లి చనిపోయింది. తర్వాత ఇక నటుడితో ప్రేమలో ఉన్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. కానీ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. కాని కరోనా వైరస్ కారణంగా అతను కూడా దూరమయ్యాడు అంటూ తన జీవితంలోని సంఘటనలు కూడా చెప్పుకొచ్చింది మాలాశ్రీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: