ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ స్థాయి పై రాజమౌళి సందేహాలు !
‘ఆర్ ఆర్ ఆర్’ ‘బాహుబలి’ స్థాయిని మించి సక్సస్ అవుతుందా అన్న ప్రశ్నకు రాజమౌళి ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా మూవీగా మిగిలిపోతుండా లేకుంటే పాన్ వరల్డ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటుందా అనేవిషయం తాను ఇప్పుడు చెప్పలేనని రానున్న కాలమే ఈవిషయాన్ని తెలుస్తుంది అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
గతంలో తాను తీసిన ‘బాహుబలి’ మూవీని చైనా జపాన్ భాషలలో డబ్ చేసి విడుదల చేసినప్పుడు ఆ దేశాలలోని ప్రేక్షకులు విపరీతంగా చూడటంతో ‘బాహుబలి’ కలక్షన్స్ 1000 కోట్లు దాటినా విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో తన అంచనాలు వేరుగా ఉన్నాయని ఈమూవీకి ప్రపంచవ్యాప్తంగా 3000 వేల కోట్లు వస్తే బాగుండును అని తన మనసుకు అనిపించినా ‘ఆర్ ఆర్ ఆర్’ చైనా కొరియా జపాన్ దేశాల ప్రేక్షకులు నచ్చి ఆదరించే విధానం బట్టి ఈమూవీ పాన్ ఇండియా మూవీగా రికార్డు క్రియేట్ చేస్తుందా లేక పాన్ వరల్డ్ మూవీగా మారుతుందా అన్నవిషయం క్లారిటీ వస్తుంది అంటున్నారు.
ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ ‘మగధీర’ మూవీ చేసిన తరువాత తాను మళ్ళీ పెద్ద సినిమాలు చేయకూడదని అనేకసార్లు అనుకుని సునీల్ తో ‘మర్యాదరామన్న’ తీసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ మాట ఇచ్చి మాట తప్పినట్లుగా తాను కూడ మాటతప్పి ‘ఈగ’ ‘బాహుబలి’ లాంటి సినిమాల తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై దృష్టి పెట్టాను అని చెప్పుకువచ్చాడు జక్కన్న..