ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న అక్కినేని హీరో..!!

Divya
 ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అందరికీ అందుబాటులోనే ఉన్నది. దీంతో కొన్ని కొత్త చిత్రాలను కూడా డైరెక్టుగానే బుల్లితెరపై చూస్తూ ఉన్నాము. ఇక అంతే కాకుండా పలు వెబ్ సిరీస్ లను కూడా చూడడం జరుగుతోంది. ప్రస్తుతం కొంతమంది సినిమాలకు దూరమై కేవలం వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నారు. ఇందులో కూడా కొన్ని విలక్షణమైన పాత్రల్లో నటిస్తున్న నటీనటులు ఉన్నారు. బాలీవుడ్లో ఇప్పటికే కొంతమంది నటీనటుల సైతం వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లోని మరో హీరో కూడా ఓటిటి ప్లాట్ ఫాం లోకి అడుగు పెడుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఈ మధ్య డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు  కూడా వరుసగా మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా దూత అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు మరొక హీరో సుశాంత్ కూడా ఓటీటీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు గా కరెంట్, అడ్డా, ఇతర సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించిన అప్పటికీ కానీ ఆ తర్వాత సినిమాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అలా వైకుంఠపురం చిత్రంతో సెకండ్ హీరోగా కూడా ట్రై చేసిన ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ఇప్పుడు తాజాగా వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారిగా ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు సుశాంత్. అది కూడా zee-5 సంస్థ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తోంది. ఈ రోజున సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ఫోటో ని విడుదల చేయడం జరిగింది. సుశాంత్ కు సంబంధించి ఎంట్రీని zee-5 చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: