ప్రభాస్ కి సర్జరీ .. షాక్ లో అభిమానులు..!!
ఇకపోతే తాజాగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా మార్చి 11వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. పిరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుందని చెప్పవచ్చు. కేవలం రూ.మూడు వందల కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాముడిగా ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో రానున్నాడు ప్రభాస్.
ఇక ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ కే , సలార్, స్పిరిట్ వంటి చిత్రాలు వరుసలో ఉన్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ఆయన మారుతి డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న ప్రభాస్ కు అనారోగ్యం కొంచెం ఎక్కువ కావడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది. అందుకే పూర్తిగా సినిమాల షూటింగ్ లకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే భయపడాల్సిన అవసరమేమీ లేదని త్వరలోనే ప్రభాస్ కోలుకుంటారని వైద్యులు కూడా చెప్పడం విశేషం.