పూరీ జగన్నాథ్ కుమారుడు అయిన
ఆకాష్ హీరోగా వచ్చిన లేటెస్ట్
సినిమా 'రొమాంటిక్' . ఈ
సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా
కేతిక శర్మ నటించి మెప్పించింది.. అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ
భామ తన అందచందాలతో బాగా పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్‌గా ఉండే ఈ భామఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతుంది.
రొమాంటిక్ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించి మెప్పించింది.ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్‌ను స్వయంగా ఇంటర్వూ చేయడం కూడా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అంతేకాదు
రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో కనిపించింది.. వీరితో పాటు
హిందీ నటుడు అయిన మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారట.. ఈ సినిమాను
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు
పూరి కనెక్ట్స్ పతాకాల పై
పూరి జగన్నాథ్,
ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.
ఇక
ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే..
ఆకాష్ హీరోగా ఓ కొత్త
సినిమా ప్రారంభమైందని సమాచారం..
జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నారట ఆకాష్. ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నారట.చోర్ బజార్
లవ్ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట.
ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు మరియు పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారట.
హీరోయిన్ కేతిక శర్మ విషయానికి ఆమె ఈ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు నాగశౌర్య లక్ష్యలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే..