ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్..!!

Divya
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ . ఈ చిత్రంలోని కథ ప్రపంచం విస్తుపోతుంది చూసిన సంఘటన తెరపైన చూపించడం జరిగింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాని తెరకెక్కించడానికి ఎంతో కష్టపడి తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన భారీగా విడుదల అయింది. ఈ చిత్రంలో ప్రతి ఒక్క కథానాయిక కూడా ఎంతో అద్భుతంగా నటించారు. దీంతో ఈ సినిమా థియేటర్ల సంఖ్య అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. 1990లో కాశ్మీర్ పండిట్ల పై జరిగిన దాడి గురించి.. అందులో పిల్లల పై జరిగిన అమానుష కాండను వివరంగా చూపించడం జరిగింది.

సాధారణంగా యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను ఈ మధ్య కాలంలో బాగా తెరకెక్కించడం తో వాటికి మంచి హైప్ పెరిగిపోయింది. ఇలాంటి చిత్రాలకు భారీ బడ్జెట్, స్టార్స్ వంటి వారు ఎందరు నటిస్తూ ఉంటారు. కానీ ఈ చిత్రానికి ఈ రెండు లేకపోవడంతో పెద్దగా ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. కేవలం అతి తక్కువ బడ్జెట్ తోనే చిన్న చిన్న పాత్రల్లో ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే ఇలాంటి సినిమా పోస్టర్లు చూసి అవార్డులు వస్తాయేమో కానీ డబ్బులు రావు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి ఈ సినిమా వసూళ్ల పరంగా ముందంజలో ఉన్నది.

ఈ చిత్రం మొదటి రోజున 630 థియేటర్లలో విడుదల కాగా ఇక ఆ తర్వాత రోజులు గడిచే సరికి మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇప్పుడు 4 వేల థియేటర్లలో ఈ సినిమా ఆడుతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రం వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కడా చూడలేదని. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడండి అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: