వైరల్ : విజయ్ దేవరకొండ ని ఆ హీరోయిన్తో చూసి.. షాకైన ఛార్మి?

praveen
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు  స్టార్ హీరో రేసులోకి దూకేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతు ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే గా నటించింది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఈ రౌడీ హీరో సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించినా హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు. అలాంటిది ఒక హీరోయిన్ తో కనిపించాడు అంటే చాలు ఇక అదే సోషల్ మీడియాను ఊపేస్తు ఉంటుంది.


 ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక హీరోయిన్ తో కనిపించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజును ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ పార్టీకి లైగర్  మూవీ యూనిట్ కూడా హాజరైంది. అయితే పార్టీలో హీరోయిన్ అనన్య తో కలిసి అటు విజయ్ దేవరకొండ మాట్లాడుతున్న ఒక వీడియోను ఛార్మి షేర్ చేసింది. ఆ జోడి ని చూసి స్టన్ అయ్యాను అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది..ఇకపోతే లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తోనే జనగణమన సినిమా తీసేందుకు సిద్ధమయ్యా విజయ్ దేవరకొండ.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: