చరణ్ జూనియర్ ల మధ్య ఆ తేడాను గమనించిన రాజమౌళి !
వ్యక్తిగతంగా తనకు చరణ్ జూనియర్ లు చాల సన్నిహితులనీ వారిద్దరితో తాను గతంలో సినిమాలు తీయడం వల్ల తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు అంటూ తన అనుభవాలను కొన్ని వివరించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటి వాడని ఒక సీన్ వివరించి చెపుతుండగానే ఆసీన్ లో ఎలా నటించాలి అన్నది చాల స్పీడ్ గా క్యాచ్ చేయగలడు అంటూ తారక్ పై ప్రశంసలు కురిపించాడు.
చరణ్ మాత్రం ఒక తెల్లకాగితం లాంటి వ్యక్తి అని దర్శకుడు ఒక పెయింటర్ గా మారి తాను ఎలాంటి నటనను రాబట్టుకోవాలి అని భావిస్తే ఆనటనలోకి చరణ్ ఒదిగిపోతాడు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే చరణ్ కంటే జూనియర్ ను డీల్ చేయడం చాల కష్టం అని నిరంతరం ఇంకా బాగా నటించాలి అన్న తపనతో జూనియర్ ప్రవర్తన ఉంటుంది కాబట్టి అతడికి సీన్ చెప్పేడప్పుడు తనకు ఒక నటుడుగా కాకుండా ఒక సూపర్ కంప్యూటర్ లా తనకు జూనియర్ కనిపిస్తాడు అంటూ వారిద్దరి తేడాను బయటపెట్టాడు.
ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి మాట్లాడుతూ ఈమూవీకి సీక్వెల్ ఉండదని అయితే తాను ‘బాహుబలి 3’ మాత్రం ఖచ్చితంగా తీస్తానని అయితే తాను ఎప్పుడు తీస్తానో తను చెప్పలేను అంటూ తన భవిష్యత్ సినిమాల పై మరొక క్లారిటీ ఇచ్చాడు. ఇదే సందర్భంలో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘బాహుబలి’ మూవీ బడ్జెట్ కంటే ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ ఎక్కువ అన్న విషయం పై క్లారిటీ ఇస్తూ ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తాను ఇవ్వలేను అని తెలివిగా ప్రశ్నను దాటవేశాడు..