అనిల్ రావిపూడి మాటల వెనుక ఆంతర్యం ?

Seetha Sailaja
రాజమౌళి కొరటాల శివలు తరువాత ఇప్పటివరకు పరాజయం అన్న పదం ఎదురు కాకుండా వరసపెట్టి విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రమే. జంధ్యాల ఏకలవ్య శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనీల్ రావిపూడి తీసిన సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావు.


ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్ 3’ తీస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ తన సినిమాలను చాల వేగంగా పూర్తి చేస్తాడు అన్న పేరుంది. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ అందరివాడుగా పేరు గాంచిన ఈ డైరెక్టర్ లేటెస్ట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.


తనకు పాన్ ఇండియా సినిమాల పై ఆశక్తి లేదనీ తాను తీసే సినిమాలు అన్నీ తెలుగు సినిమా ప్రేక్షకుడు నవ్వుకునేందుకే అని కామెంట్ చేసాడు. అంతేకాదు తాను కొంతమంది దర్శకుల విధానంలో సంవత్సరాలు తరబడి తనకు సినిమాలు తీయడం అంటే ఇష్టం ఉండదని అభిప్రాయపడ్డాడు. యధాలాపంగా అతడు అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ రాజమౌళిని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి అంటూ కొందరు అప్పుడే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేసారు.


అయితే ఈవిషయంలో అనీల్ రావిపూడి ఉద్దేశ్యాలు వేరు. అతడి సినిమాల పరిధి అతడి సినిమా లపై నిర్మాతలు ఖర్చు పెట్టే బడ్జెట్ గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే తాను పాన్ ఇండియా సినిమాలు చేయను అంటే ఆవిషయాన్ని మరొక కోణంలో విశ్లేషిస్తూ ఈ యంగ్ డైరెక్టర్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని పరిశీలిస్తే సోషల్ మీడియా ఎవర్నీ వదలదు అన్నవిషయం మరొకసారి రుజువవుతోంది. బాలకృష్ణ ను విపరీతంగా అభిమానించే ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో బాలయ్యలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీయడానికి ఒక వెరైటీ స్క్రిప్ట్ వ్రాస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: