సలార్ లో పూజ హెగ్డే వేరే లెవెల్ రోల్ అంతే..!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. కేజిఎఫ్ స్థాయిలోనే  ఈ సినిమా కూడా ఉండబోతుంది అన్నట్లుగా బజ్ క్రియేట్ చేశాయి. ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా ను రీమేక్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో ఎంతవరకు నిజం ఉందొ చూడాలి. 

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా అవకాశం రావడం నిజంగా ఆమెకు ఎంతగానో ఉపయోగ పడే అవకాశం ఉంది. ఆమె కెరీర్ మునుపటి లా ఊపు అందుకోవాలి అంటే తప్పకుండా భారీ అవకాశం రావాలి అది ఈ సలార్ సినిమా రూపంలో వచ్చింది అని చెప్పవచ్చు.  

ఈ సినిమాతో పాటు శృతి హాసన్ మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ ఉండగా ఈ సినిమాలో ఆమె నటించబోయే పాత్ర గురించి వెల్లడించింది చిత్రబృందం. అద్య అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఈ ఈమె పాత్ర ఉండబోతుంది అని అంటున్నారు. తప్పకుండా ఈ పాత్రకు ఆమె మంచి న్యాయం చేస్తుందని ఆమెకి మంచి పాపులారిటీ వస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క టీజర్ ను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ భావిస్తున్నారు. ప్రభాస్ కి కూడా ఈ చిత్రం విజయం కావాల్సిన అవసరం ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: