బంపర్ ఆఫర్.. భీమ్లా నాయక్ బైక్ సొంతం చేసుకునే ఛాన్స్.

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  రానా హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.కన్నడ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్  సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  అంతేకాదు భారీ కలెక్షన్లు సైతం కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా సరసన నిత్యమీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ సినిమా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కగా.. డైలాగులు స్క్రీన్ ప్లే మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇవ్వడం గమనార్హం. ఇక భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే తెలుగు ఓటీటి ఆహా లో స్ట్రీమింగ్  కాబోతుంది. అదే సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా రాబోతుంది. అయితే తెలుగువారికి బాగా దగ్గరైన ఓటిటి ప్లాట్ఫాం ఆహా భీమ్లా నాయక్ అభిమానులందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన కనిపిస్తూ ఉంటాడు. చాలా సన్నివేశాల్లో కూడా ఈ బైక్ కనిపిస్తూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఈ బైక్ ని ప్రేక్షకులు సొంతం చేసుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆహా. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న భీమ్లా నాయక్ సినిమాను చూసి ఇక ఈ బైక్ సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. లక్కీడ్రా ద్వారా ఆహా సబ్స్క్రైబర్ల లో ఒకరిని ఈ బైక్ అందించబోతున్నారు. 24 అర్ధరాత్రి 12 గంటలకు భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అయినా అనంతరం ఆహా ఓటిటి నీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారిని లక్కీ డ్రా తీసి ఒకరికి పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ను బహుమతిగా  ఇవ్వబోతున్నారట.  దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట. ఈ విషయం గురించి తెలిసి బైక్ సొంతం చేసుకోవడానికి అటు అభిమానులు అందరూ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: