డిజిటల్ ఎంట్రీ కి రెడీ అయిన సుశాంత్..!

Pulgam Srinivas
ప్రస్తుతం 'ఓ టి టి'  కంటెంట్ మీద స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్న  విషయం మనందరికీ తెలిసిందే,  ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నవారు కూడా 'ఓ టి టి' కంటెంట్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.  అలాగే ప్రస్తుతం నాగ చైతన్య లాంటి మంచి క్రేజ్ ఉన్న హీరో కూడా కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూన్నారు,  అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం సుశాంత్ కూడా 'ఓ టి టి' కంటెంట్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.  కాళిదాసు సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్  ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చి౹౹ల౹౹సౌ౹౹ సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ లో హీరోగా నటించిన సుషాంత్ ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయడు.


 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుశాంత్,  మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు,  ఇలా సినిమాలలో హీరోగా అలాగే ఇతర పాత్రలలో నటిస్తూ వస్తున్న సుశాంత్ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది,  సుశాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.  ఈ వెబ్ సిరీస్ స్కూల్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు,  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుండి సుశాంత్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది,  మరి ఇప్పటి వరకు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుశాంత్ ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎ మేర అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: