ఇక ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి పలు వేడుకులు నిర్వహించి జనవరి నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూసినా కాని కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు చిత్ర యూనిట్.ఇక ఇప్పుడు ఈ సినిమాను మార్చి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మార్చి 19 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ దుబాయ్‌లో సినిమా ప్రమోషన్స్ ముగించుకుని బెంగళూరుకు కూడా చేరుకున్నారు. అయితే ఈ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనను చేయలేదు.దీంతో సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారే ఈ సినిమాకు పలానా గెస్టు వస్తున్నారంటూ వార్తలను తెగ వైరల్ చేశారు.
కాగా తాజాగా rrr సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారనే విషయంపై చిత్ర దర్శకుడు జక్కన్న దెబ్బకు ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ప్రీరిలీజ్ వేడుకకు స్వయంగా కర్ణాటక సీఎం అయిన బస్వరాజ్ బొమ్మై వస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు.ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుక బాధ్యతలను KVN ప్రొడక్షన్స్‌కు చెందిన వెంకట్‌కు అప్పగించగాne , ఆయన దీనికి సంబంధించిన ఏర్పాట్లను చాలా అద్భుతంగా చేస్తున్నారంటూ జక్కన్న ఓ వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చీఫ్ గెస్ట్ ఎవరనే విషయం ఎట్టకేలకు బట్టబయలయ్యింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు అక్కడి పోలీసులు. ఇక ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.