డెలివరీ బాయ్ గా మారిన కమెడియన్.. ఎవరో తెలుసా?

praveen
బాలీవుడ్ లో ప్రముఖ వ్యాఖ్యాత ఎంత గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎప్పుడు వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తు ఉంటాడు. బాలీవుడ్ స్టార్ హీరో లెవల్లో క్రేజ్ దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఇక కపిల్ శర్మ ఎలాంటి షో చేసిన కూడా అది టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. బుల్లితెర కార్యక్రమం మాత్రమే కాదు  పలు సినిమాల్లో కూడా ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటాడు. తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తూ  ఉంటారు.


 ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కామెడీయన్ కపిల్ శర్మ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ టాప్ సెలబ్రిటీ కాస్త డెలివరీ బాయ్ అవతారంలో కనిపించాడు. ఈ ఫోటో లో భాగంగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఒక కంపెనీకి చెందిన పసుపు రంగు దుస్తులు ధరించి బైక్ పై కూర్చున్నాడు  వెనకాల బ్లూ కలర్ బ్యాగ్ వేసుకుని ఎడమ చేతికి వాచీ పెట్టుకొని నల్లటి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అయితే సాధారణంగా డెలివరీ బాయ్స్  ఇలా వెనక బ్యాగ్ వేసుకుంటూ ఉంటారు.  అసలు కపిల్ శర్మ ఎందుకు డెలివరీ బాయ్ గా  ఎందుకు మారిపోయాడు అంటూ అనిపించుకుంటున్నారూ అందరు.


 అయితే ఇది ఒక సినిమాలో ఓ సన్నివేశం అన్నది ఇటీవలే బయట పడింది. అందుకే డెలివరీ బాయ్ పాత్రలో కనిపించాడు కపిల్ శర్మ అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక కపిల్ శర్మ నటిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ నందిత దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా సంగతి తెలిసిందే. కపిల్ శర్మ డెలివరీ బాయ్ పాత్రలో నటించిన ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. షూటింగ్లో భాగంగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తో వైరల్ గా మారింది. ఇక కపిల్ శర్మ డెలివరీ బాయ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: