మరో రీమెక్ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్..!
ఇందులో గాడ్‌ఫాదర్ ఒకటి.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టారు..లూసిఫర్, భోళాశంకర్ సినిమాల చేస్తున్నారు. అవి షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే విడుదల చెసెందుకు చిత్రబృందం షూటింగ్ ను త్వరగా ఫినిష్ చేయాలనీ అనుకున్నారు.చిరంజీవి మరో మలయాళ సినిమా పైన మనసు పారేసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిన బ్రో డాడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికార ప్రకటన అందిస్తున్నట్లు తెలుస్తుంది.
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లొ నటించిన బ్రో డాడీ మూవీని తెలుగులో వెంకటేష్, రానా కలిసి చేయాలని అనుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత దగ్గు పాటి సురేష్ బాబు తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, బ్రో డాడీ మూవీ చిరంజీవికి నచ్చడంతో దానిని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా సమాచారం. మరి ఎవరూ ఆ సినిమాను చెస్తారొ చూడాలి..మరోవైపు చిరంజీవి ఆచార్య సినిమాకి రిలీజ్‌కి సిద్దంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాని ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు.. మొత్తానికి చిరు వరుస సినిమా లతో ఫుల్ బిజీగా వున్నారు..